School Assembly on 24th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి

School Assembly on 24th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి

పాఠశాల అసెంబ్లీ – 24th August, 2019 : AP / Telangana Today’s News, Good Poem, Today’s Good News, Today’s GK, Today’s Good Word, Today’s Good News, Today’s Nationalism, National / International Days, Today’s Child, Today’s Story, The Great Man’s Word, Today’s Proverb etc for School Assembly on 24th August, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

School Assembly on 24th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి

పాఠశాల అసెంబ్లీ : నేటి వార్తలు 24th August, 2019

  1. ఏప్రిల్‌ 1 నుంచి జనగణన: దేశంలో 2021 జనాభా లెక్కల రిజిస్టర్‌ తయారీ కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణన జరగనుంది. అసోం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సెప్టెంబరు 30 వరకు సాగుతుంది.
  2. కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకటించిన ప్రభుత్వం: ఏపీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటించింది. 2019-20 ఏడాదికి దీన్ని తీసుకొచ్చింది. మద్యం దుకాణాల ఏర్పాటు నిబంధనలతో సవివరంగా ఆదేశాలు జారీ చేసింది.
  3. భూమికి చేరువలో భారీ గ్రహం. పాలపుంతలోనే గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు: భూమికి చేరువలో ఓ భారీ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. భూగోళంతో పోలిస్తే దాని పరిమాణం మూడు వేల రెట్లు ఎక్కువ. పాలపుంతలోనే ‘బీటా పిక్టోరిస్‌’ అనే నవజాత నక్షత్రం చుట్టూ అది పరిభ్రమిస్తోంది. ‘బీ పిక్టోరిస్‌ సీ’గా నూతన గ్రహానికి నామకరణం చేశారు.
  4. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌?: టీమిండియా నూతన బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది. గతవారం క్రికెట్‌ సలహా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తిరిగి ఎంపికైన విషయం తెలిసిందే.
  5. సీఎంకు మురుగు నీరు.. నిందితుడి అరెస్టు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులకు పార్శిల్‌లో మురుగునీరు పంపిన నిందితుడిని పోలీసులు గుర్తించారు.

నేటి సుభాషితం

“మనలోని దుర్గుణాలను విస్మరించి, దయ, ధర్మం, క్షమ,పరోపకారం వంటి సద్గుణాలను జాగృతం చేసుకుందాం”

“I don’t focus on what I’m up against. I focus on my goals and I try to ignore the rest”

మంచి పద్యం

రాలెగాదె నేల రావణ బ్రహ్మయు
కంసరాజు కూడ కాటి కలసె
అవని కూలె గాదె హాటక కశిపుడు
ఎదుగనీదు గర్వ మెవరినైన

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన “శ్రుతి సౌరభము” అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె Today GK

ప్రశ్న: గూగుల్ సంస్థ ఆసియాలోనే తన మొదటి అతిపెద్ద క్యాంపస్‌ను ఏ నగరంలో నిర్మించాలని ఇటీవల నిర్ణయించింది?

జ: హైదరాబాద్

చరిత్రలో ఈరోజు, ఆగష్టు 24

సంఘటనలు

♦️ ‍1875: ఇంగ్లీష్ చానల్ ఈదిన తొలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు.
♦️ 1962: నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి.
♦️ 1970: ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్‌లో ప్రారంభమయ్యాయి.

జననాలు

1899 : అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్
1908: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931)
1918: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
1923: హోమీ సేత్నా, సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (మ.2010)
1927: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (మ.2014)
1928: దాశరథి రంగాచార్యులు, ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015)
1929 : మాజీ పాలస్తీనా లిబరేషన్ సంస్ధ చైర్మన్ యాసర్ అరాఫత్ జననం.(మ.2004)
1945 : అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్‌
1981 : అమెరికా నటుడు, చాడ్ మైఖేల్ ముర్రేజననం.
1985: గీతా మాధురి, తెలుగు సినీ గాయని.

మరణాలు

1993: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (జ.1904)
2009: కన్నెగంటి వేంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యరు.
2011: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయా చిత్రకారుడు. (జ.1939)
2015: ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్.

నేటి పండుగలు/జాతీయ దినోత్సవాలు

ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం
సంస్కృత దినోత్సవం.

నేటి ఆణిముత్యం

తప్పు చేసి బొంకి గొప్పగా నెంచకు
కప్పిపుచ్చు కొలది కాల్చు నిన్ను
నిజము నిగ్గుతేలు నిలకడ మీదైన
తెలిసి మసలుకొనుమ తెలివి గలిగి!

భావం:

తప్పు చేసి దాన్ని దాచాలని చూడడం అవివేకం.దాచే కొలది అది దహించి వేస్తుంది.నిజం ఎప్పటికైనా బయటపడుతుంది.కాబట్టి తప్పు తెలుిసుకుని ప్రవర్తనను చక్కదిద్ధు కోవడం ఉత్తమం.

రచన:డా.గూటంస్వామి.(9441092870)

నేటి సుభాషితం

భగవంతుడు విగ్రహాల్లో ఉండడు, మీ భావాలే భగవత్ స్వరూపం మీ మనసే దేవాలయం

నేటి సామెత

దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు

ప్రతి రోజు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వున్నప్పుడు ఏ రోజుకారోజు ….. ప్రాణాపాయం తప్పిందని బయట పడ్డామని సంతోష పడేవారి నుద్దేసించి ఈ సామెత వాడతారు.

నేటి జాతీయం

కాలు ద్రువ్వు :  పోట్లాటకు పిలవడం, వాడు నామీదికి కాలు దువ్వుతున్నాడు.

కాలు కాలిన పిల్లి : అసహనంగా తిరగటం. ఒక చోట నిలకడగా వుండక, అసహనంగా అటు ఇటూ తిరుగు తుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

నేటి చిన్నారి గీతం

మనిషిగా పుటిన దెందుకురా?
మనిషిగా పుటిన దెందుకురా?
మంచిని పెంచేటందుకురా
బడికి వెళ్ళే దెందుకురా?
చదువులు నేర్చేటందుకురా
చదువులు నేర్చే దెందుకురా?
జ్ఞానం పొందేటందుకురా
జ్ఞానం పొందే దెందుకురా?
ప్రగతిని పెంచేటందుకురా ప్రగతిని పెంచే దెందుకురా?
చక్కగ బ్రతికేటందుకురా

నేటి కథ


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మీరే ఊహించుకోవాలి ప్రభూ…!

శ్రీ కృష్ణదేవరాయులు ఆస్థానంలో అష్ట దిగ్గజాలైన కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణుడు అనే కవి సుప్రసిద్ధులు. ఈయనను తెనాలి రామలింగ కవి అనికూడా పిలుస్తుంటారు. ఆయన మహా తెలివైనవారు, చక్కటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, హాస్యకవిగా గుర్తింపు పొందిన ఈయనకు వికటకవి అనే బిరుదు కూడా కలదు.

ఒకసారి రాయలవారికి ఏమీ తోచకుండా ఉండటంతో… కోట గోడలకు వర్ణచిత్రాలను తగిలిస్తే చాలా అందంగా ఉంటుంది కదా అని అనుకుంటారు. ఆ పనికోసం ఆయన ఓ చిత్రకారుడిని పిలిపించారు. ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కటి చిత్రాలు గీసి తీసుకురాగా, అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ రామలింగ కవికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి.

ఓ వ్యక్తి పక్కకు తిరిగి నిలబడిన చిత్రాన్ని చూసిన రామలింగ కవికి… “రెండో వైపు ఎక్కడున్నది, మిగిలిన శరీర భాగాలు ఏమైనాయి?” లాంటి సందేహాలు కలిగాయి. అదే విషయాన్ని రాయలవారి వద్ద ప్రస్తావించగా.. “రామలింగా.. మీరు ఆ మాత్రం ఎరుగలేరా..? వాటిని మీరు ఊహించుకోవాలి కదా…?” అన్నారు రాయలవారు.

“ఆహా… అలాగా ప్రభూ… బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యిందిలెండి” అన్నాడు రామలింగకవి. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు రాయలవారి వద్దకు వచ్చిన ఆయన.. “మహారాజా… కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ కష్టపడి చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనం గోడలమీద కొన్ని చిత్రాలు గీస్తాన”ని అన్నాడు.

దీంతో సంతోషం పట్టలేని రాయలవారి ముఖం విప్పారింది. “అద్భుతం… రామలింగ కవి చిత్రాలు వేయటమా, వేయండి వేయండి. పాత మసిబారిన చిత్రాల్ని తీసివేసి, మీరు సరికొత్త చిత్రాలను గీసేయండి” అన్నాడు రాయలవారు ఉత్సాహంగా…! వెంటనే పాత చిత్రపటాల మీద సున్నం కొట్టించేసిన ఆయన తన సొంత చిత్రాలను గీయడం ప్రారంభించాడు.

ఆ చిత్రాలలో అక్కడొక కాలు, ఇక్కడొక కన్ను, ఇంకోచోట ఒక వేలు… ఇలా గీశాడు రామలింగ కవి. అలా గోడలన్నింటినీ శరీర భాగాలతో నింపిన ఆయన తన హస్తకళా నైపుణ్యాన్ని చూపించేందుకు రాయలవారిని తోడుకుని వచ్చారు. విడివిడి శరీర భాగాలను చూసిన రాజుగారు నివ్వెరపోయి.. “ఏంటి రామలింగా… గోడలపైన ఏంచేశారు, చిత్రాలెక్కడ…?” అని ప్రశ్నించారు.

“ఈ చిత్రాలలో నేను వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి కదా, ప్రభూ…!!” అన్నాడు రామలింగ కవి. రామలింగడి సమాధానంతో ఖంగుతిన్న రాయలవారు మౌనంగా ఉండిపోయారు. ఈలోపు “తమరింకా నా చిత్రాల్లోని అత్యద్భుతమైనదాన్ని చూడనేలేదు ప్రభూ” అన్నాడు రామలింగడు.

రాయలవారికి తిరిగీ ఉత్సాహం పొడసూపగా పదండి చూద్దాం.. అంటూ తొందరపెట్టారు. రాయలవారిని ఓ గోడ వద్దకు తీసుకువెళ్లి ఎలాఉందో చూడమన్నాడు రామలింగ కవి. చూస్తే ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చని రంగుగల గీతలు మాత్రం గోడలో అక్కడక్కడా ఉన్నాయి.

“ఇదేంటి రామలింగా…?” అని అడిగాడు రాయలవారు ఉస్సూరుమంటూ. “గడ్డిమేస్తున్న ఆవు ప్రభూ” బదులిచ్చాడు రామలింగడు. మరి గడ్డెక్కడ..? అన్నాడు మహారాజు. ఆవు తినేసింది కదండీ అన్నాడు రామలింగడు. మరి ఆవెక్కడ ఉంది..? తిరిగీ ప్రశ్నించాడు రాయలవారు. గడ్డిని మేసేసిన తరువాత ఆవు ఇంటికి వెళ్లిపోయింది ప్రభూ అన్నాడు రామలింగడు. రామలింగకవి తెలివితేటలను మనసులోనే అభినందించిన రాయలవారు మరేమీ అడగలేక నోరు వెళ్లబెట్టేశారు.

సకరణ:సొంటేల ధనుంజయ